భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి అరుదైన గౌరవం దక్కింది. మన్మోహన్ సింగ్‌కు బ్రిటన్‌లో జీవితాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్- బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. బ్రిటన్‌లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం (ఎన్ఐఎస్ఏయూ) త్వరలోనే ఢిల్లీలో మన్మోహన్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.
బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలో చదివి లబ్దప్రతిష్ఠులైన భారతీయ విద్యార్థులకు ఇచ్చే అవార్డు ఇది. భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మన్మోహన్ పేర్కొన్నారు.
కాగా… బ్రిటీష్ విశ్వవిద్యాలయాలలో జీవితంలో ఘన విజయాలు సాధించిన భారతీయులకు లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ పురస్కారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఎన్ఐఎస్ఎయు బ్రిటిష్ కౌన్సిల్ ఇన్ ఇండియా, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ భాగస్వామ్యంతో ఇండియా యూకే ఎచీవర్స్ హానర్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల మన్మోహన్ స్పందిస్తూ.. బ్రిటీష్ యూనివర్శిటీల్లో చదువుకుని భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనను ఎంతో కదిలిస్తోందని తన లిఖిత సందేశంలో పేర్కొన్నారు.