»Delhi Jaipur Ajmer Vande Bharat Express Pm Narendra Modi Flag Off Rajasthan First Vande Bharat Express
Vandhe Bharat:రాజస్థాన్ లో తొలి వందేభారత్ ట్రైన్.. ప్రారంభించనున్న ప్రధాని
రాజస్థాన్లో ప్రధాని మోడీ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.
Vandhe Bharat: కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్-తిరుపతి, చెన్నై-కోయంబత్తూరు మధ్య రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు(Vandhe Bharat Express)ను ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణలోని సికింద్రాబాద్ -తిరుపతి(Tirupathi) మధ్య ప్రయాణ సమయం(Journey Time) సుమారు మూడున్నర గంటలు తగ్గింది. తాజాగా రాజస్థాన్లో ప్రధాని మోడీ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలు అజ్మీర్ నుంచి న్యూఢిల్లీ(New Delhi) మధ్య నడుస్తుంది. జైపూర్, అల్వార్, గుర్గావ్లలో వందేభారత్ రైలు ఆగుతుంది.
జైపూర్(Jaipur)-ఢిల్లీ కాంట్ వందే భారత్ ప్రారంభ ప్రత్యేక రైలు సర్వీస్ జైపూర్ నుండి ఉదయం 11.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్ ట్రైన్ అజ్మీర్ నుండి ఢిల్లీ వరకు 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్ప్రెస్(Shatabdi Express). ఇది ఢిల్లీ నుండి అజ్మీర్ మధ్య 6 గంటల 15 నిమిషాలలో ప్రయాణిస్తుంది. అందువల్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ మార్గంలో నడుస్తున్న ప్రస్తుత వేగవంతమైన రైలు కంటే 60 నిమిషాలు వేగంగా ఉంటుంది. అజ్మీర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ హై రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) సెక్టార్లో ప్రపంచంలోనే మొదటి సెమీ-హై స్పీడ్(Semi High Speed) ప్యాసింజర్ రైలు అవుతుంది. ఈ రైలు పుష్కర్, అజ్మీర్ షరీఫ్ దర్గాతో సహా రాజస్థాన్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం( PMO) తెలిపింది.