Delhi High Court refused to grant interim bail to CM Arvind Kejriwal
CM Arvind Kejriwal: మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో నిరాశే మిగిలింది. తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఏప్రిల్ 3న విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ ఆయన అరెస్ట్ అనైతికమని, తన అరెస్టును వ్యతిరేకిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు వేయగా దానిపై విచారణ జరిపింది. సీఎం కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున ఏఎస్జీ ఎస్వీ రాజు వాదనలు విన్న కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం తప్పని, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలని సింఘ్వీ కోర్టును కోరారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర ఉపశమనాన్ని కోర్టు పరిశీలిస్తుందని, ప్రధాన పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ్‌కాంత శర్మ పేర్కొన్నారు. ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీరాజు మధ్యంతర ఉపశమనాన్ని వ్యతిరేకించారు.
చదవండి:Kerala : కేరళ సీఎం కూతురిపై మనీ లాండరింగ్ కేసు