NTR: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. దేవర పార్ట్ 1ని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్లో భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ చిత్రంలో.. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్గా గోవాలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర.. నెక్స్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇక దేవర షూటింగ్ పూర్తి కాగానే వార్ 2 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత దేవర మొదటి భాగం రిజల్ట్‌ను బట్టి రెండో భాగం ఉండనుంది.
దీంతో.. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ కంప్లీట్ చేయగానే.. ఎన్టీఆర్ సినిమా పై ఫోకస్ చేయనున్నాడు. కుదిరితే.. ఈ ఏడాది చివర్లోనే ఎన్టీఆర్ 31 స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఇప్పట్లో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండే ఛాన్స్ లేదు. కానీ.. కెజియఫ్, సలార్ దారిలోనే ఎన్టీఆర్ 31ని ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడట. ఇప్పటి వరకు నీల్ చేసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఉగ్రం తప్ప.. కెజియఫ్ రెండు భాగాలుగా వచ్చింది. త్వరలోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పుడు ఎన్టీఆర్ 31 కూడా టు పార్ట్స్ అని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. టైగర్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.