»Conrad Sangma Take Oath As Meghalaya Cm On March 7
Meghalaya CMగా కాన్రాడ్ సంగ్మా 7వ తేదీన ప్రమాణం
Meghalaya CM:మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్నాడ్ సంగ్మా (Conrad Sangma) ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. సంగ్మా పార్టీ 26 సీట్లలో (26 seats) గెలవగా.. బీజేపీ 2 స్థానాలను దక్కించుకుంది. ఇండిపెండెంట్లతో కలిసి సంగ్మా (sangma) ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. 2018లో కూడా సంగ్మా బీజేపీతో (bjp) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత సంగ్మా తన సీఎం పదవీకి రాజీనామా చేశారు.
Conrad Sangma take oath as Meghalaya CM on March 7
Meghalaya CM:మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్నాడ్ సంగ్మా (Conrad Sangma) ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. సంగ్మా పార్టీ 26 సీట్లలో (26 seats) గెలవగా.. బీజేపీ 2 స్థానాలను దక్కించుకుంది. ఇండిపెండెంట్లతో కలిసి సంగ్మా (sangma) ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. 2018లో కూడా సంగ్మా బీజేపీతో (bjp) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత సంగ్మా తన సీఎం పదవీకి రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ ఫగు చౌహాన్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు.
తనకు 32 మంది (32 mla) ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంగ్మా తెలిపారు. మిగతా నలుగురి గురించి మాత్రం చెప్పడం లేదు. ఇండిపెండెంట్లు అని లీకులు ఇచ్చారు. మేఘాలయాలో (meghalaya) మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 31 మంది సభ్యుల మద్దతు కావాలి. సంగ్మా (sangma) పార్టీ బీజేపీ కలిపితే 28 మంది వస్తున్నారు. మరో నాలుగు, ఐదుగురిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సంగ్మా పార్టీపై బీజేపీ గతంలో అవినీతి ఆరోపణలు చేసింది. అయినప్పటికీ ఆ పార్టీ వెంటే ఉంటామని ప్రకటించింది.
మేఘాలయాలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (udf) 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ (congress), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (tmc) తలొ ఐదు సీట్లను గెలుచుకున్నాయి. 7వ తేదీన జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీ ( pm modi), అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.