పంజాబ్ సీఎం భగవంత్ మన్(CM Bhagwant Mann)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జలంధర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో భగవంత్ మాన్ ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. అయితే బోట్ డ్రైవర్ (Boat driver) అప్రమత్తతతో సీఎం కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. పడవలో సీఎంతో పాటు ఎంపీ సంత్ బల్వీర్ సింగ్(MP Sant Balveer Singh) కూడా ఉన్నారు.ఓవర్ లోడ్ తో పడవ ప్రయాణిస్తూ.. కొద్ది సేపటికే వెనకభాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు రావడం, పడవ అదుపు తప్పి దాదాపు నీటిలో మునిగినట్లుగా కనిపిస్తుంది.
మోటార్ బోట్ ఓవర్ లోడ్ లో వరద ప్రవాహానికి ఎదురుగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. బోట్ లో ప్రయాణిస్తున్న సీఎంతో సహా అందరూ అయోమయానికి గురయ్యారు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంజాబ్ రాష్ట్రం (Punjab State) లో నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పంజాబ్లోని జలంధర్ (Jalandhar) లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇతర అధికారులు, వరద ప్రాంతాలను పరిశీలించేందుకు పడవ ఎక్కారు. ఈ క్రమంలో పడవ ఒక్కసారిగా నీటిలో కుదుపులకు గురైంది. దీంతో వరద నీటి ప్రవాహంలో పడవ ఒక్క పక్కకు ఒరిగింది. బోట్ డ్రైవర్ అప్రమత్తతతో ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టు అధికారులు తెలిపారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.