కొత్తగా ఈసీటీ (ECT) అందుబాటులోకి రావడంతో కింది నుంచి రోడ్డు మార్గం పైనుంచి వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఐజీఐ(IGI)ఏ అవతరించింది. ఇప్పటివరకు ఇటువంటి ఎక్కడ కూడా లేదు. వంతెన మార్గంలో టాక్సీవే కలిగిన మొట్టమొదటి విమానాశ్రయంగా ఇది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ (Delhi) నిలిచింది. కాగా విమానాశ్రయంలోని టర్మినళ్లు, హ్యాంగర్ లను రన్‌వేలతో అనుసంధానించే ప్రత్యేక మార్గాలే టాక్సీవేలు. ఈసీటీ పొడవు 2.1 కి.మీలు. ఇది దిల్లీ విమానాశ్రయంలోని ఉత్తర, దక్షిణ ఎయిర్‌ఫీల్డ్‌లను అనుసంధానిస్తుంది.మూడో రన్‌వే నుంచి టర్మినల్- 1కి మధ్య దూరాన్ని ఏడు కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది.
ఏ-380, బీ-777, బీ-747 సహా వైడ్-బాడీ విమానాలు దీనిపై నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఇప్పటికే దిల్లీ ఎయిర్‌పోర్టు(Airport)కు రోజూ 1500కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తోన్నాయి. మున్ముందు మరింత రద్దీని తట్టుకునేలా.. ప్రయాణికుల సమయం ఆదా చేసేలా సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.భారత్ అతి పెద్ద విమానాశ్రయం అయినా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
కొత్తగా నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే లతోపాటు నాలుగో రన్ వేను పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ప్రారంభించారు.ఈ రన్ వే మీదుగా ప్రయాణించడం వల్ల దాదాపు 7 కిలో మీటర్ల ప్రయాణ దూరాన్ని తగ్గించవచ్చు. దీంతో పాటూ ఫ్లైట్ లోకి త్వరగా చేరుకోవచ్చు. నిత్యం ఢిల్లీ విమానాశ్రయానికి వేల సంఖ్యలో ప్రయాణీకులు వస్తూ పోతూ ఉంటారు. అందులో డొమెస్టిక్ పాసింజర్ల(Domestic passengers)తో పాటూ అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఉంటారు. నిత్యం ఇక్కడ నుంచి 1500 లకు పైగా ఫ్లైట్లు గమనాగమానాలు చేస్తూ ఉంటాయి. వీరందరి రద్దీని సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సరికొత్త మార్గాన్వేషణను రూపొందించారు.