»Cji Dy Chandrachud Seriously Concerned About Tamil Nadu Governor Conduct Supreme Court Anger
Tamilnadu : తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై సుప్రీంకోర్టు మరోసారి కఠిన వైఖరి అవలంబించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం, గవర్నర్ తీరుపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేసింది.
Tamilnadu : తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై సుప్రీంకోర్టు మరోసారి కఠిన వైఖరి అవలంబించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం, గవర్నర్ తీరుపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేసింది. మీ గవర్నర్ ఏం చేస్తున్నారని అటార్నీ జనరల్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మినిస్టర్‌గా అపాయింట్ చేయను అన్న గవర్నర్ పై సుప్రీం కోర్టుకు వెళ్లింది తమిళనాడు ప్రభుత్వం. గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గంలో కె.పొన్ముడికి తిరిగి మంత్రి పదవిని నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రేపు (శుక్రవారం) తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌ను జాబితా చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తూ.. రేపటిలోగా గవర్నర్ చర్యలు తీసుకోకుంటే కోర్టు జోక్యం చేసుకుంటుందని సూటిగా చెప్పారు. పొన్ముడి శిక్షపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించినప్పుడు, తమిళనాడు గవర్నర్ ఆయనను ప్రమాణ స్వీకారానికి ఎందుకు అనుమతించడం లేదని కోర్టు ప్రశ్నించింది.
పొన్ముడిని తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడానికి తమిళనాడు గవర్నర్ నిరాకరించారు. ఇది రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని ఆయన అన్నారు. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆస్తుల కేసులో నిర్దోషిగా విడుదలైన పొన్ముడి తీర్పును మద్రాసు హైకోర్టు కొట్టివేయడంతో ఇటీవల పొన్ముడి ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. దీని తర్వాత, ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరడంతో పొన్ముడి దోషిగా, రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించబడింది. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవిని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేయగా గవర్నర్ ఆర్ఎన్ రవి నిరాకరించారు.