»Bollywood Celebrities And Indian Cricket Players Attended Ganesh Celebrations At Mukesh Ambanis House
Mukesh Ambani: అంబాని ఇంట్లో వినాయక చవితి వేడుకలకు హాజరైన స్టార్స్
వినాయక చవితి వచ్చిందంటే చాలు పల్లే నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున హడావిడి ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కూడా ఆ కోలాహలం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఇండియన్ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో అయితే ఏకంగా బాలీవుడ్ స్టార్లతో, క్రికెట్ ప్లేయర్లతో నిండిపోయింది.
Bollywood celebrities and Indian cricket players attended Ganesh celebrations at Mukesh Ambani's house
Mukesh Ambani: ప్రతి సంవత్సరం వినాయక చవితి(Vinayaka Chavithi)ని భారతీయులు ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికి తెలిసిందే. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai) నగరం అంతా గణేష్ ఉత్సవాలతో నిండిపోయి ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఇంట అట్టహాసంగా చతుర్థి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ల నుంచి క్రికెట్ దిగ్గజాల వరకు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అంబానీ ఆయన ఇంట్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తరువాత లాల్బగీచా రాజాను దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి అక్కడికి వెళ్లిన అంబాని ఈ సారి 2 వేల నోట్ల రూపాయలతో తయారు చేసిన పెద్ద దండను వినాయకుడికి ఇచ్చారు .ఆ దండని చూసిన నెటిజన్స్ అంబానీకి తగ్గట్టుగానే ఉందని అంటున్నారు.
#WATCH | Maharashtra: Former Indian cricketer Sachin Tendulkar along with his family, arrived at Mukesh Ambani's residence 'Antilia' in Mumbai to attend Ganesh Chaturthi celebrations.#GaneshChaturthipic.twitter.com/7xhqrwL1a9