ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. బీజేపీ నేతలు ఈ కుట్ర చేస్తున్నారంటూ ఆయన ఆరోపించడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో… ఎన్నికల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతుండంతో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చేసిన తీవ్ర సంచలనంగా మారాయి. కేజ్రీవాల్ భద్రత పట్ల తనకు ఆందోళనగా ఉందని మనోజ్ తివారీ చేసిన ఓ ట్వీట్ రాజకీయ దుమారానికి దారి తీసింది.
మనోజ్ తివారీ వ్యాఖ్యలపై ఆప్ సీనియర్ నేత, మంత్రి మనీశ్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మనోజ్ తివారీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘానికి, ఢిల్లీ పోలీసులకు మనోజ్ తివారీపై ఫిర్యాదు చేయనున్నట్లు మనీశ్ సిసోడియా తెలిపారు. కేజ్రీవాల్‌ను చంపాలని మనోజ్ తివారీకి ఎవరు ఆదేశించారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు.
మనోజ్ తివారీ తన గూండాలను ఉపయోగించి ఆప్ అధినేతను హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి బెదిరింపులకు ఆప్ భయపడేది లేదని మనీశ్ సిసోడియా అన్నారు.