Kejriwal has given conditions only if he attends the ED
Delhi: ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని పిటిషన్ దాఖలైంది. దీంతో ఈరోజు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించలేమని, జైలు నుంచి పాలన కొనసాగించడాన్ని అడ్డుకోలేమని, న్యాయపరమైన జోక్యానికి అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం.. పరిపాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. సుర్జీత్ సింగ్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఏ అధికారి కింద కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌ను పిటిషనర్ కోరారు.