యూపీ (UP)లోని దేవ్బంధ్లో ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(Chandrasekhar Azad)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన కొంత మంది దుండుగులు ఆయన కాన్వాయ్‌పై అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఆజాద్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అతడి అనుచరులు ఆజాద్‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆజాద్‌పై కాల్పులకు తెగబడిన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా, ఆజాద్‌పై
(firing) జరిపింది ఎవరు.. ఎందుకు జరిపారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆజాద్‌పై కాల్పులు జరిగిన విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పలువురు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా పోలీసులు కొన్ని ప్రాంతాల్లో భారీ బందోబస్తు (Huge provision) ఏర్పాటు చేశారు. తనపై కాల్పులు జరిపింది ఎవరో తనకు తెలియదని, కానీ, తన పార్టీకి చెందిన వారు వారిని చూశారని చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. ఆసుపత్రిలో ఆయన మాట్లాడారు. దుండగుల కారు సహరాన్పూర్ (Saharanpur) మీదుగా వెళ్లిందని చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో తమ కారులో తన తమ్ముడితో పాటు మరో నలుగురం ఉన్నారని తెలిపారు..