బాలీవుడ్(Bollywood)లో బెట్టింగ్ యాప్ మాటున జరుగుతున్న స్కామ్ వెలుగులో వచ్చింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app scam) ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న దాదాపు 17 మంది బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సన్నద్ధమవుతోంది. బీ-టౌన్ నటుడు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్(Sunny Leone), గాయని నేహా కక్కర్, నుష్రత్ భరుచ్చా, తదితరులకు సమన్లు పంపేందుకు దర్యాప్తు సంస్థ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే దీనికి కారణం. దీంతో వారికి ఈడీ నోటిసులు జారీ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.
సౌరభ్ చంద్రఖర్(Saurabh Chandrakhar), రవి ఉప్పల్ దుబాయ్ కేంద్రంగా దేశంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా(Kolkata), భోపాల్, ముంబయి వంటి తదితర నగరాల్లో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు సంపాదించింది. మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫోషోర్ ఖాతాలకు తరలించేందుకు హావాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్ యాప్ పెద్దఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లూ తెలిపింది.కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్ యాప్ పెద్దఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లూ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే దుబాయ్(Dubai)లోని సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్లో ఈ సెప్టెంబర్ 18న జరగాల్సిన పార్టీకి హాజరయ్యేందుకు బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రమోటర్లు రూ.40 కోట్లు చెల్లించారని ఆరోపణలతో కొంతమంది తారలను ఇప్పటికే ఈడీ పరిశీలిస్తోంది. బాలీవుడ్ పెద్దలు రెండు ఈవెంట్లకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల నుండి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్‌కు చెందిన ఒక అసోసియేట్‌తో ఎంఓబి (MOB) సమన్వయంతో బెట్టింగ్ యాప్‌ను లాంచ్ చేసిందన్న ఆరోపణలను కూడా ఈ విచారణ ధృవీకరిస్తున్నట్లు ఇడి వర్గాలు పెర్కోన్నారు.