మాఘ పౌర్ణమి సందర్భంగా గంగా నదిలో స్నానం చేసేందుకు హరిద్వార్‌కు వెళుతున్న ప్రయాణికుల ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెరువులో పడిపోయింఇ. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు.
five killed in bapatla ap auto and lorry collision accident
Uttar Pradesh Accident Today : ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులే ఉండటం అందరినీ కలవర పరుస్తోంది. యాత్రికులను తీసుకువెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెరువులో పడిపోవడం వల్ల ఈ దారుణ ఘటన జరిగింది. వీరంతా హరిద్వార్‌కు వెళుతుండగా కాస్గంజ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాత్రికులంతా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని గంగా స్నానాలు చేసేందుకు ట్రాక్టర్లో హరిద్వార్‌కు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యంలో గధయ్య గ్రామ సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి బోల్తా పడింది. ఈ విషయాన్ని చూసిన స్థానికులు కొందరు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి పలువురిని కాపాడారు. అయినా సరే పదిహేను మంది ప్రాణాలు బలయిపోయాయి. పలువురికి గాయాలయ్యాయి.
సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానథ్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.