Sachin Tendulkar’s Son : ఐపీఎల్ 2023 లో చోటు దక్కించుకున్న అర్జున్ టెండుల్కర్..!
Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఏకైక కుమారుడు... అర్జున్ టెండుల్కర్ మరోసారి ఐపీఎల్ లో చోటు దక్కించుకున్నాడు. చివరి నిమిషంలో అర్జున్ కి చోటు దక్కడం విశేషం. బుమ్రా లేకపోవడంతో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఏకైక కుమారుడు… అర్జున్ టెండుల్కర్ మరోసారి ఐపీఎల్ లో చోటు దక్కించుకున్నాడు. చివరి నిమిషంలో అర్జున్ కి చోటు దక్కడం విశేషం. బుమ్రా లేకపోవడంతో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఈ ఏడాది ఐపీఎల్ ఆడనున్నాడు. టీం డేవిడ్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ ఏడాది కూడా ముంబై జట్టుకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు గత ఏడాది దారుణంగా పరాజయం పాలయింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచులే గెలిచింది. ఈ సారి స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్, రిచర్డ్ సన్ తదితరులు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మిస్ అవుతున్నారు. అర్జున్ టెండూల్కర్ చాలా కాలంగా ముంబై జట్టులో ఉన్నా సరైన అవకాశాలు రాలేదు. తన ప్రతిభను ప్రదర్శించే ఛాన్స్ లభించలేదు. మరి ఈ ఏడాది అయినా తన టాలెంట్ ని ప్రదర్శిస్తాడేలేదో చూడాలి.