what are 80 thousand cops doing! court pulls up punjab government
ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ (Khalistani separatist Amritpal Singh) ముఖ్య అనుచరుడు, మెంటార్ పపల్ ప్రీత్ సింగ్ ను (Papalpreet Singh) పంజాబ్ పోలీసులు (Punjab Police) హోషియార్ పూర్ లో సోమవారం అరెస్ట్ చేశారు. పంజాబ్ పోలీసు, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (Punjab Police and its counter-intelligence unit) సంయూక్త ఆపరేషన్ లో వారికి దొరికిపోయాడు. పారిపోయిన అనంతరం అమృత్ పాల్ సింగ్, పపల్ ప్రీత్ సింగ్ వేర్వేరు చోట్ల దాక్కున్నట్లుగా చెప్పారు. వీరిద్దరు జలంధర్, హోషియార్ పూర్, అమృత్ సర్ తదితర జిల్లాలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో దాచుకుంటున్నట్లుగా చెప్పారు. వీరి ఇద్దరు పగ్వారా టౌన్, నాడ్ లోన్ గ్రామం, బిబి గ్రామం… ఇలా వేర్వేరు చోట్ల డేరాల్లో ఉంటున్నట్లుగా గుర్తించారు. మార్చి 18వ తేదీ నుండి అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పపల్ ప్రీత్ సింగ్ ఖలిస్థాన్ అనుకూల సానుభూతిపరుడు. ఇప్పటికే పోలీసులు అమృతపాల్ సింగ్ అనుచరులను, సన్నిహితులను పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అమృతపాల్ ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వేర్వేరు వేషధారణలలో కనిపించిన ఆధారాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పపల్ ప్రీత్ సింగ్ హోషియార్ పూర్లోని ఒక గ్రామంలో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ లో చూసిన పోలీసులు అతని కోసం అన్వేషణ సాగించారు. హోషియార్ పూర్లోని మర్నాయన్ గ్రామానికి కేవలం రెండు నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న తనౌలీ గ్రామంలో ఉన్న డేరా ఫుటేజీని గుర్తించారు. బుధవారం ఉదయం డేరాలోని సీసీటీవీ ఫుటేజీలో పపల్ ప్రీత్ సింగ్ కనిపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పపల్ ప్రీత్, అమృత్ పాల్ వాహనాన్ని పోలీసులు వెంబడించడంతో హోషియార్ పూర్లో విడిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్ ను కూడా రంగంలోకి దింపారు. అమృత్ పాల్ సింగ్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన రెండు వీడియోలు, ఆడియో క్లిప్స్ లలో కనిపించాడు. తాను పారిపోలేదని, త్వరలో ప్రపంచం ముందుకు వస్తానని చెబుతున్నాడు.