»Amit Shah They Have No Identity After Knowing History
Amith Shaw: చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదు
అయోధ్య రామమందిర నిర్మాణం, బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ వేడుకలపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు చేశారు.
Amith Shaw: అయోధ్య రామమందిర నిర్మాణం, బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ వేడుకలపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. శ్రీరాముడు లేని భారతదేశాన్ని ఊహించుకోలేమన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 కొన్ని వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. రామమందిర ఉద్యమం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరూ చరిత్రను చదవలేరు. 1528 నుంచి ప్రతి తరం ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని చూసింది. అయిదు శతాబ్దాల పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటానికి తెర పడింది.
అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకికవాదాన్ని చాటిచెప్పింది. దేశం మొత్తం కలల కన్న అయోధ్య ఆలయం మోదీ ప్రభుత్వ హయాంలో సాకారమైందని అమిత్ షా తెలిపారు. అలాగే ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ నవ భారత ప్రయాణానికి నాంది. శ్రీరాముడి లేని భారతాన్ని ఊహించుకునేవారికి మన దేశం గురించి పూర్తిగా తెలియదు. చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదని అమిత్ షా అన్నారు.