»A Huge Amount Of Mutilated Notes Were Found On The Road And Fields In Hardoi
Bihar : రోడ్లు, పొలాల్లో కరెన్సీ డస్ట్.. మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు
బిహార్ రాష్ట్రంలో రోడ్లపై, పొలాల్లో భారీగా చిరిగిన నోట్లు బయటపడిన ఉదంతం వెలుగు చూసింది. నోట్లను చూస్తుంటే యంత్రంతో కట్ చేసి విసిరేసినట్లుగా తెలుస్తోంది.
Bihar : బిహార్ రాష్ట్రంలో రోడ్లపై, పొలాల్లో భారీగా చిరిగిన నోట్లు బయటపడిన ఉదంతం వెలుగు చూసింది. నోట్లను చూస్తుంటే యంత్రంతో కట్ చేసి విసిరేసినట్లుగా తెలుస్తోంది. విషయం కాసింపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్గంజ్ పట్టణంలోని కచౌనా లింక్ రోడ్డు పరిధిలో చోటు చేసుకుంది. భారీ మొత్తంలో భారతీయ కరెన్సీ డస్ట్ దొరకడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కరెన్సీ నోట్ల డస్ట్ ఎక్కడికక్కడ కుప్పలుగా పడి ఉన్నాయి. స్థానికులకు సమాచారం అందడంతో జనం గుమిగూడారు. ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను ముక్కలు చేయడం చూసి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాసింపూర్ పోలీస్ స్టేషన్‌లోని గౌస్గంజ్ ప్రాంతంలోని కచౌనా లింక్ రోడ్‌లోని శ్యామ్ సింగ్, రాజేంద్ర సుబేదార్ల పొలం దగ్గర రోడ్డు పక్కన పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల క్లిప్పింగ్‌లను స్థానిక ప్రజలు చూశారు. నోట్ ముక్కులు గడ్డిలా చక్కగా కత్తిరించబడ్డాయి. కుప్పలు తెప్పలుగా నోట్ల క్లిప్పింగులను చూసిన వెంటనే జనం అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ అంశం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది గ్రామస్తులు తమ ఇళ్లకు నోట్ ముక్కలను తీసుకెళ్లడం ప్రారంభించారు. నోట్లను పరిశీలిస్తే ఈ నోట్లను ఎవరో యంత్రం ద్వారా కోసి ముక్కలు చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, దొరికిన నోటు ముక్కలు అక్రమ నోట్లా లేదా చెల్లుబాటు అయ్యే నోట్లా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.
చదవండి:Rajasthan : టెన్త్ లో ఫస్ట్.. ఆనందం ఆవిరి.. మరో నలుగురి జీవితాలు నిలబెట్టిన విద్యార్థిని
మొత్తం విషయంపై సమాచారం ఇస్తూ, అదనపు ఎస్పీ నృపేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఇది కాసింపూర్ పోలీస్ స్టేషన్‌లోని గౌస్గంజ్ పట్టణానికి చెందినదని, ఇక్కడ రాజేంద్ర సుబేదార్, శ్యామ్ సింగ్‌లకు పొలాలు ఉన్నాయని చెప్పారు. భారతీయ కరెన్సీని పోలినట్లుగా కనిపించే ఈ క్లిప్పింగ్‌లు రోడ్డు పక్కన కనిపించాయి. విచారణ జరుగుతోంది. విచారణ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.