పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా వచ్చే నెల విడుదల కానుంది. అయితే తాజాగా ప్రభాస్ ఓ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ అవుతోంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. బాక్సాఫీసు రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ ఓ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ అవుతోంది. ఈ స్టోరీలో ప్రభాస్.. ‘డార్లింగ్.. చివరికి మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అని రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్‌లో చెప్పిన వ్యక్తి ఎవరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కమల్ హాసన్ లుక్ రిలీజ్ చేయనున్నారట.
అందుకే కల్కి సినిమాలో భాగంగా ప్రమోషన్స్ కోసమే ఈ పోస్ట్ పెట్టారని సమాచారం. ప్రభాస్‌కు కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టం. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా చాలాసార్లు చెప్పారు. మరికొందరు తన వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా గుడ్‌న్యూస్ చెప్పదలచుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ జూన్ 27న రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంతో రానున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కమల్‌హాసన్ ప్రతినాయకుడి పాత పోషిస్తున్నారు.