జార్ఖండ్ ధన్ బాద్లో ఆశిర్వాద్ టవర్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల చెలరేగి, వేగంగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వీరిలో నలుగురు ఉన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చాలా మంది చిక్కుకున్నారు. ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆరు, ఏడో అంతస్తులో మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. సహాయక చర్యల్లో జిల్లా అధికారులు నిమగ్నం అయ్యారని పేర్కొన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలను తాను దగ్గరుండి పరిశీలిస్తున్నాని పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు.