తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ‘2018’ మూవీ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జోసెఫ్ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కథ పరంగా రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, రజినీ నటించిన ‘వేట్టయాన్’ మూవీ దసరాకు రిలీజ్ కానుంది.