చాలామంది యువత డ్రగ్స్‌కు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం చాలా విలువైందని, డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.