AP: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపుదలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరల పెంపునకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు వెలువరించింది. కాగా 14 రోజుల పాటు టికెట్ ధరలను మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్లలో రూ.110 పెంచుకునేలా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.