దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ టార్గెట్‌గా యాత్ర2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
Yatra 2: మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన యాత్ర (Yatra) మూవీలో.. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో చోటు చేసుకున్న కీలక సంఘటనలు, సంక్షేమ పథకాలను చూపించారు. రాజ శేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుత నటనను ప్రదర్శించారు. దాంతో అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపారు మేకర్స్. గత ఎన్నికల సమయంలో యాత్ర మూవీ రాగా.. వచ్చే ఎలక్షన్స్ టార్గెట్‌గా యాత్ర 2 రాబోతోంది. యాత్ర చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న యాత్ర 2లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
సెకండ్ పార్టులో మమ్ముట్టి, జీవా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. యాత్ర2 షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో మొదలైన షెడ్యూల్లో మమ్ముట్టి జాయిన్ అయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్లో మమ్ముట్టి, జీవాపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను Three Autumn Leaves, V Celluloid సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. మరి ఎలక్షన్స్ టార్గెట్‌గా వస్తున్న యాత్ర2.. రాజకీయంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.