సింగర్ చిన్మయి అంటే ఠక్కున గుర్తు పట్టడం కాస్త కష్టమే. కానీ సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈమె చెప్పిన డస్కీ వాయిస్ డబ్బింగ్.. అచ్చు సమంత వాయిస్‌లానే ఉంటుంది. అందుకే సమంత అనగానే.. చిన్మయి కూడా అందరికీ గుర్తొస్తుంది. అయితే సింగర్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ విషయంలో చిన్మయి తర్వేతే ఎవ్వరైనా. ఆమె చేసే స్టేట్మెంట్స్ అంత బోల్డ్ అండ్ ఓపెన్‌గా ఉంటాయి.
ఈ మధ్య కుర్రాళ్లు ఆడవాళ్ల మీద చేసే రీల్స్ మీద.. చిన్మయి చాలా ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్టు.. తన ఓపినియన్‌ను చెప్పేస్తోంది. రీసెంట్గా ఓ వీడియో చూసిన తర్వాత.. వర్జినిటీ పై గట్టిగానే క్లాస్ తీసుకుంది చిన్మయి. ఇదే కాదు.. గతంలో ఆడవాళ్లపై వచ్చే కామెంట్స్ అండ్ వీడియోలకి చిన్మయి తనదైన స్టైల్లో దుమ్ముదులిపేసేంది. తాజాగా మరోసారి అదిరిపోయే కౌంటర్ ఇచ్చి పడేసింది. అమ్మాయిలు డ్రెస్‌లపై చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారంటూ.. ఓ యువకుడు చేసిన వీడియోని షేర్ చేసింది చిన్మయి. ‘అమ్మాయిలు ఎలాగూ చున్నీలు వేసుకోవడం లేదు కదా బ్రో.. మనం అయినా చున్నీ వేసుకుందాం.. చున్నీ వేసుకోవడానికి వాళ్లు అష్టకష్టాలు పడుతున్నారు.. అంటూ ఓ వీడియోని షేర్ చేశాడు.
దీనిపై చిన్మయి తనదైన స్టైల్లో స్పందించింది. Pelli chesukodam aina maneyali gani ilanti edavalni maatram chesukokoodadu vellu valla intlo women ela treat chestharo talachukunte bayam vesindi.God shall protect those women.. అంటూ రాసుకొచ్చింది. అలాగే.. ‘రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవే ఆడాళ్లు వేసుకునే బ్లౌజ్ కల్చర్‌ని తీసుకుని వచ్చింది. ఆ తరువాత పెట్టీకోట్ కల్చర్ వచ్చింది. అప్పటికీ అసలు జాకెట్టే వేసుకునేవారు కాదు. చీరనే.. జాకెట్‌గా మడిచి ధరించేవారని.. చెప్పుకొచ్చింది. అలాగే మహిళల్ని జాకెట్ లేకుండా చూస్తే బ్రిటిష్ వాళ్లకి కలిగిన లైంగిక కోర్కెల వల్లే.. ఇండియా వాళ్లు బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. బ్లౌజ్ అనేది.. బ్రిటీష్ వాళ్ల కల్చర్. మన దేవాలయాలపై ఉన్న బొమ్మలకు కూడా బట్టలు ఉండవు. కళ్లు తెరిచి.. మన కల్చర్ ఏంటో తెలుసుకోండి. ఇండియన్ కల్చర్ తెలియదా? ఫాలో అవ్వరా? ఇట్లాంటి సలహాలు చెప్పే ముందు.. వాళ్లని ఇండియన్ కల్చర్ ఫాలో అవ్వమని చెప్పండి. మీ బ్రెయిన్‌ని వాష్ చేసుకుని.. కామంతో చూడకుండా ఉండండి.. అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.