స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాగే ఇప్పుడు తమన్నా కూడా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అయితే శృతి హాసన్ సక్సెస్ అయినప్పటికీ.. తమన్నా పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి తమన్నాను కాపాడే హీరో ఎవరు?
ఒకప్పటి తమన్నా వేరు.. ఇప్పుడు చూస్తున్న తమన్నా వేరు.. అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు తమన్నాలో ఇంత మార్పు చూడలేదని.. ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్నా.. ఇంత హాట్‌గా చూడలేదని అంటున్నారు నెటిజన్స్. ఇటీవలె రెండు వెబ్ సిరీస్‌తో రచ్చ లేపింది తమన్నా. అయినా కూడా అమ్మడికి కలిసి రాలేదు. ముందుగా ‘జీ కర్థ’ అనే వెబ్ సిరీస్ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది తమన్నా. ఇక ఈ వేడి చల్లారకముందే.. మరో సెన్సేషన్ వెబ్ సిరీస్‌తో హీట్ ఎక్కించింది. లస్ట్ స్టోరీస్ సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన లస్ట్ సోరీస్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.
ఇందులో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి రెచ్చిపోయింది తమన్నా. ఈ సిరీస్‌లలో తనలోని హాట్ యాంగిల్‌ను బయటపెట్టింది తమన్నా. కానీ ఇది తన సినీ కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవలేదు. కానీ ఆగష్టులో మాత్రం ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆడియెన్స్ ముందుకి రాబోతోంది తమన్నా. సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘జైలర్’, మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. ఆగష్టు 10 న జైలర్, ఆగష్టు 11 న భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
పోయిన సంక్రాంతికి కూడా శృతి హాసన్ చిరు, బాలయ్యతో కలిసి నటించిన వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు గ్యాప్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. చిరు, బాలయ్య.. శృతి హాసన్‌కి మంచి కిక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఒక్కరోజు గ్యాప్‌లో చిరు, రజనీతో కలిసి రాబోతోంది తమన్నా. దీంతో ఈ రెండు సినిమాలు తమన్నాను కాపాడుతాయా? లేదంటే మళ్లీ అడల్ట్ కంటెంట్ సిరీస్‌లే చేసుకోమంటాయా? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి శృతి లాగే తమన్నా రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంటుందేమో చూడాలి.