»What Is The Box Office Target Of Vishwak Sens Dhamki
Vishwak Sen ‘ధమ్కీ’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే!?
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఉగాదికి పాన్ ఇండియా ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. అతనే హీరోగా నటించి.. దర్శకత్వం కూడా వహించాడు.. పైగా సొంత ప్రొడక్షన్లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ ధమ్కీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు విశ్వక్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఉగాదికి పాన్ ఇండియా ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. అతనే హీరోగా నటించి.. దర్శకత్వం కూడా వహించాడు.. పైగా సొంత ప్రొడక్షన్లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ ధమ్కీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు విశ్వక్. అందుకే నందమూరి హీరోలతో గట్టిగా ప్రమోట్ చేయించాడు. బాలయ్య చేతుల మీదుగా ట్రైలర్, ఎన్టీఆర్ గెస్ట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి.. భారీ హైప్ క్రియేట్ చేశాడు. అలాగే తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ధమ్కీ సెకండాఫ్ తన బాక్సాఫీస్ లెక్కల్నీ మారుస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ కంటే.. సెకండాఫ్‌లో ఆగం ఆగం అవుతారని.. చెమటలు పట్టించేలా ఉంటుందని అంటున్నాడు. అందుకు తగ్గట్టే విశ్వక్ కెరీర్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హైయెస్ట్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపి ఏడున్నర కోట్లకుపైగా ‘ధమ్కీ’ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఓవరాల్‌గా ఎనిమిది నుంచి పది కోట్ల కలెక్షన్స్ వస్తే.. విశ్వక్సేస్ సేఫ్ అంటున్నారు. అయితే విశ్వక్ ఈ టార్గెట్‌ను ఈజీగా రీచ్ అవుతాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఉగాదికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో.. ధమ్కీ పైనే కాస్త బజ్ ఉంది. థియేటర్ల కొరత కూడా లేనట్టే. దానికి తోడు నందమూరి హీరోలు, ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉండటం విశ్వక్సేన్కు కలిసోచ్చే అంశమే. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ధమ్కీ ఇచ్చిపడేసినట్టే. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ డ్యూయెల్ రోల్లో నటించాడు. మరి విశ్వక్‌కు ‘ధమ్కీ’ మూవీ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.