మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వింటేజ్ మాసివ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అదరిపోయేలా ఉంది. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం ఈ ఇద్దరిపై అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మాసివ్ ఫైట్‌ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్నారట. త్వరలోనే రవితేజకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ దాదాపు 40 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. దాంతో వాల్తేరు వీరయ్య మల్టీ స్టారర్ మూవీ అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. బ్యాలెన్స్ షూటింగ్ శరవేగంగా షూట్ చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ తన డబ్బింగ్ వర్క్‌ని స్టార్ట్ చేసేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిరు చాలా వరకు డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టుగా సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దాంతో మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. త్వరలోనే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. మరి భారీ అంచనాలతో వస్తున్న వాల్తేరు వీరయ్య.. బాక్సాఫీస్ దగ్గర ఎలా సందడి చేస్తుందో చూడాలి.