»Vivek Agnihotri On Shah Rukh Khan And Karan Johar Stardom System In Bollywood
Vivek Agnihotri:షారుఖ్, కరణ్ బాలీవుడ్‌ను నాశనం చేశారు.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్య
షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి వారు బాలీవుడ్ ను నాశనం చేశారని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. 'ఈ వ్యక్తులు భారతదేశంలోని నిజమైన కథలను సినిమా నుండి తొలగించారు. షాహెన్షా, దీవార్ వంటి చిత్రాల తర్వాత నిజమైన కథలు బాలీవుడ్ చిత్రాల నుండి అదృశ్యమయ్యాయని అగ్నిహోత్రి అన్నారు.
Vivek Agnihotri:’ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో వివాదాల్లో చిక్కుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. మరో సారి తన రాబోయే చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’తో వార్తల్లో నిలిచారు. ప్రతి విషయంలోనూ తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పే దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇది కాకుండానే ఆయన చాలాసార్లు వివాదాలలో చిక్కుకున్నారు. ఈసారి వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ,దర్శకుడు కరణ్ జోహార్లను టార్గెట్ చేశాడు.
షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి వారు బాలీవుడ్ ను నాశనం చేశారని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ‘ఈ వ్యక్తులు భారతదేశంలోని నిజమైన కథలను సినిమా నుండి తొలగించారు. షాహెన్షా, దీవార్ వంటి చిత్రాల తర్వాత నిజమైన కథలు బాలీవుడ్ చిత్రాల నుండి అదృశ్యమయ్యాయని అగ్నిహోత్రి అన్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్ చేసే సినిమాలు భారతదేశ సాంస్కృతిక ఫాబ్రిక్‌కు చాలా నష్టం కలిగించాయంటూ బాంబు పేల్చారు.
బాలీవుడ్లో కరణ్ జోహార్ స్టార్‌డమ్‌ను ప్రోత్సహిస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు. బాలీవుడ్లో రాజకీయాలు ప్రోత్సహించింది కరణ్ జోహారే అన్నారు. మంచి సినిమాలు తీయలేదని కాదు.. స్టార్ సిస్టంను ప్రమోట్ చేస్తున్నాడు. 8 ఏళ్ల చిన్నారి కోసం ఎందుకు సినిమా తీయలేకపోతున్నారు. హిందీ మాట్లాడే వారు, ప్రతిభావంతులు ముందుకు రావాలని ఎందుకు కోరుకోవడం లేదు? అని ప్రశ్నించారు.
షారుక్‌కి రాజకీయాలంటే ఇష్టం లేదు
వివేక్ మాట్లాడుతూ ‘కొంతమంది తమ స్టార్డమ్ కోసమే పని చేస్తుంటారు. ఇంతమంది సినిమా నిర్మాతలు కాదు. సాధారణ బాలీవుడ్ వ్యవస్థలో ప్రజలకు సినిమాపై మక్కువ ఉండదు. వారు డబ్బు, వారి స్టార్డమ్ కోసం మాత్రమే పని చేస్తారు. నేను షారుక్ ఖాన్ అభిమానిని, కానీ బాలీవుడ్లో ఆయన చెబుతున్న రాజకీయాలు సినిమాని నాశనం చేస్తున్నాయి.
షారూఖ్-కరణ్ సినిమాని నాశనం చేశారు
ఒకప్పుడు వామపక్ష భావజాలంతో ప్రభావితమైన వివేక్ అగ్నిహోత్రి దృక్పథం ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఆలోచన, భావజాలం కూడా మారిపోయింది. ఒకప్పుడు చాక్లెట్, హేట్ స్టోరీ, ధనా ధన్ గోల్ లాంటి సినిమాలు తీసిన వివేక్ అగ్నిహోత్రి.. ఇప్పుడు హార్డ్ హిట్టింగ్ సినిమా వైపు అడుగులేస్తున్నాడు. భారతదేశంలోని చిన్న పట్టణాల్లో ఇలాంటి నిజమైన కథలు ఉన్నాయని, కథల కోసం మనం మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.