Jr.NTR : ప్రస్తుతం ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సపరేటు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్. లేటెస్ట్ ఫిల్మ్ 'దాస్ కా ధమ్కీ' ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. విశ్వక్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే.
ప్రస్తుతం ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సపరేటు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్. లేటెస్ట్ ఫిల్మ్ ‘దాస్ కా ధమ్కీ’ ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. విశ్వక్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే. విశ్వక్ సేన్ హీరో మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. అందుకే ధమ్కీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ధమ్కీతో తన బాక్సాఫీస్ లెక్కలు మార్చాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు విశ్వక్. మార్చి 17న ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. రీసెంట్‌గానే అమెరికా నుంచి తిరిగొచ్చాడు ఎన్టీఆర్. ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ అటెండ్ అవుతున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే. అందుకే ‘ధమ్కీ’ ఈవెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే విశ్వక్ సేన్.. తన అభిమాన హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. మామూలుగానే స్టేజ్ పై విశ్వక్ సేన్ రచ్చ రచ్చ చేస్తాడు. అలాంటిది ఎన్టీఆర్ స్టైజ్ పై ఉంటే.. ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ‘మాస్ అమ్మ మొగుడు’ అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేసేశాడు. ఇప్పటి వరకు తారక్‌ను యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్గానే పిలిచారు అభిమానులు. కానీ విశ్వక్ మాత్రం ‘మాస్ అమ్మ మొగుడు ఎన్టీఆర్’ అంటూ రచ్చ చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే.. ఇది ఎన్టీఆర్‌కు కొత్త బిరుదు అనే చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానులకు ఇది తెగ నచ్చేసింది. ఖచ్చితంగా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత.. ఎన్టీఆర్‌ను ‘మాస్ అమ్మ మొగుడిగా’ ట్రెండ్ చేయడం పక్కా అంటున్నారు. మరి దీనిపై ధమ్కీ వేదిక పై విశ్వక్ సేన్ ఏమంటాడో చూడాలి.