పందొంకోడి విశాల్ మరో కొత్త సినిమాతో దూసుకొస్తున్నాడు. ఈసారి ఊరమాస్ సినిమతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రత్నం గ్లింప్స్‌తోనే వణుకు పుట్టించిన విశాల్.. తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేశాడు. రత్నం రిలీజ్ ఎప్పుడంటే?
Vishal: హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో విశాల్. కానీ గత కొంత కాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు. దీంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని.. మాస్ డైరెక్టర్ హరితో రత్నం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో భరణి, పూజ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి ‘రత్నం’గా రాబోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ హౌజ్ అయినటువంటి స్టోన్ బెంచర్స్ మరియు జీ స్టూడియోస్ సౌత్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ రీసెంట్‌గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 2023 జులైలో అఫీషియల్‌గా అనౌన్స్ అయిన రత్నం సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేశారు.
ఇక ఇప్పుడు అదే స్పీడ్‌లో రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఏప్రిల్ 26న తమిళం మరియు తెలుగు భాషలో రత్నం సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘రత్నం’ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిటెక్టివ్ 2’ మూవీ మీద ఫోకస్ పెట్టాడు విశాల్. ‘డిటెక్టివ్’ చిత్రాన్ని మిస్కిన్ డైరెక్ట్ చేయగా.. హీరో, డైరెక్టర్‌కు పడకపోవడంతో సీక్వెల్‌కు విశాల్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఏదేమైనా.. విశాల్, హరి కలిసి రత్నం సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.