యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ నటించిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించాడు. గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. కాంతార్ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. తాజాగా ఈ సినిమా ఓటిటి డేల్ లాక్ అపోయింది.
ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన విరూపాక్ష సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సమ్మర్లో వచ్చిన ఏజెంట్, రామబాణం లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో థియేటర్లో విరూపాక్ష మాత్రమే ఆప్షన్‌గా మారిపోయింది. అందుకే ఈ సినిమా పై కాసుల వర్షం కురిసింది. సమ్మర్ సీజన్లో వచ్చిన సినిమాల్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి 25 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు 25 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇంకా థియేటర్లో ఈ సినిమా రన్ అవుతునే ఉంది. కానీ అప్పుడే ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు.
ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. దాంతో సరిగ్గా నెల రోజులకు ఓటిటిలోకి స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది విరూపాక్ష. ముందుగా తెలుగులో మే 21 నుంచి విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్కి అందుబాటులోకి రానున్నట్టు.. నెట్ ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాను ముందుగా థియేటర్లో తెలుగులో మాత్రమే రిలీజ్ చేసి.. ఆ తర్వాత పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశారు. కానీ తెలుగులో తప్పితే మిగతా భాషల్లో విరూపాక్ష ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా ముందు తెలుగులో ఓటిటి స్ట్రీమింగ్ చేసి.. మిగతా భాషల్లో కాస్త లేట్‌గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.