Sai Pallavi: మళయాళీ ప్రేమమ్ సినిమాలో తన డ్యాన్స్‌తో పిచ్చెక్కించింది సాయి పల్లవి. ఆమె కోసమే ఆ సినిమాను రిపీట్ మోడ్‌లో చూశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఎంతలా అంటే.. ఏకంగా లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది అమ్మడు. నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే. అసలైన మాస్ బీట్ పడలేదు కానీ.. అమ్మడి డ్యాన్స్‌కు థియేటర్ టాపులు లేచిపోతాయ్. ఆమె డ్యాన్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి బ్యూటీ తన చెల్లెలి ఎంగేజ్మెంట్లో ఎలా ఆగుతుంది, అస్సలు ఆగదు. ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్గా ట్రై చేసింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు.
కానీ పూజా కన్నన్ చాలా కాలంగా వినీత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఫైనల్‌గా పూజ, వినీత్ తమ పెళ్లి కోసం పెద్దలను ఒప్పించారు. ఆదివారం నాడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో సాయి పల్లవి తన చెల్లెలితో పాటు కొంతమంది బంధువులతో కలిసి డాన్స్ చేసింది. అందుకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే.. పూజ కన్నన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. తెలుగులో కాస్త గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి.. ప్రజెంట్ నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘తండేల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది.