»Vijay Made The Reel Video Without Telling Samantha
Video Viral: సమంతకు తెలియకుండా ఇన్‌స్టా రీల్ చేసిన విజయ్ దేవరకొండ
'నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే' అంటూ ఖుషీ మూవీ లిరిక్స్ కు తగ్గట్టు సమంత(Samantha)తో విజయ్ దేవరకొండ రీల్ చేశాడు. అయితే సమంతకు తెలియకుండా ఈ రీల్ చేసినట్లు విజయ్ (Vijay devarakonda) తెలిపాడు.
టాలీవుడ్(Tollywood) యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి(Khushi). దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సమంత ఆ మధ్య అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్ కాస్త ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.
విజయ్ దేవరకొండ షేర్ చేసిన వీడియో:
ఇప్పటికే ఖుషి మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ(Vijay devarakonda) పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నా రోజా నువ్వే’ సాంగ్ (Naa Nuvve song)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు విజయ్ రీల్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
‘నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే’ అంటూ లిరిక్స్ తగ్గట్టుకు సమంత(Samantha)తో రీల్ చేశాడు. అయితే సమంతకు తెలియకుండా ఈ రీల్ చేసినట్లు విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్, విజయ్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.