Tamannaah Bhatia: ఐపీఎల్ వివాదం.. తమన్నకు సైబర్‌ క్రైమ్ నోటీసులు

ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ విషయంలో సినీ నటి తమన్నకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. తమన్న వలన కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వయాకమ్ ఫిర్యాదు చేసింది.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 12:46 PM IST

Tamannaah Bhatia: సినీనటి తమన్నా భాటియాకు (Tamannaah Bhatia) మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు పంపించారు. వయాకమ్ ఫిర్యాదు మేరకు నటికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వయాకమ్ అనేది ప్రముఖ చలనచిత్ర, టెలివిజన్ ప్రచారం రంగంలో పేరున్న సంస్థ. గత సంవత్సరం ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను ఆ సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తమన్న ఐపీఎల్ 2023 మ్యాచ్ ప్రసారాలను ఫెయిర్ ప్లే యాప్‌లో లైవ్ స్ట్రీమ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో నిబంధనలకు వ్యతిరేకంగా మ్యాచ్‌లను యాప్‌లో స్ట్రీమింగ్‌ చేసినందుకు ఏప్రిల్ 29న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.

చదవండి:Love Today Ivana: పోజులతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ

తమన్న చేసిన పనికి ఆ సంస్థకు కోట్ల నష్టం వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ప్రసార హక్కులు తీసుకున్న తరువాత లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఆరోపణలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) పేరు కూడా ఉందా. ఆయనకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఏప్రిల్ 23 వ తేదీనే హాజరు కావాల్సి ఉండగా సంజయ్ దత్ అందుబాటులో లేడని, అతని విచారణ మరోసారి వాయిదా పడింది. ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలియాల్సి ఉందని మయాకమ్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నను హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇక తమన్న హాజరైతే ఇందులో ఎవరెవరు ఉన్నారనేది బయటపడనుంది.

చదవండి:Family Star: హిట్ అన్నారు.. కానీ 3 వారాల్లోనే ఓటిటిలోకి!

Related News

Tamannaah: షాకింగ్.. తమన్నా, సమంతను బంధించిన బాయ్ ఫ్రెండ్!

నిజమే.. బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న తమన్నాను చూసి ఒక్కసారిగా షాక్ అయిందట సమంత. అసలు సామ్ అక్కడికి ఎందుకెళ్లింది? తమన్నా ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది? సామ్ ఎందుకు షాక్ అయింది? అనే వివరాలు ఓ సారి చూస్తే..!