»Urvashi Rautela Was Harassed By Akhils Post Actress Filed A Case
Urvashi Rautela : ఊర్వశి రౌతేలాను అఖిల్ వేధించాడంటూ పోస్ట్..కేసు వేసిన నటి
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని క్రిటిక్ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై ఊర్వశి రౌతేలా స్పందిస్తూ పరువునష్టం దావా కేసు వేసింది.
బాలీవుడ్(Bollywood) నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)ను అఖిల్(Akhil) వేధించాడంటూ క్రిటిక్ ఉమైర్ సంధూ(Umair Sandhu) ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై ఊర్వశి రౌతేలా ఫైర్ అయ్యింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న ఉమైర్ సంధూపై పరువునష్టం దావా కేసు వేసింది. ఉమైర్ సంధూ తనను తాను విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడినని చెప్పుకుంటూ ప్రచారంలోకి వచ్చాడు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలపై ఉమైర్ సంధూ రివ్యూలు ఇస్తుండేవాడు.
ఉమైర్ సంధూ(Umair Sandhu) చేసిన పోస్టుపై ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమైర్ ట్వీట్లో వాస్తవం లేదని తెలిపింది. అఖిల్(Akhil) తనను ఎటువంటి వేధింపులకు గురిచేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఉమైర్ సంధూపై పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించింది. ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నవారి వల్ల తాను, తన కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఊర్వశి రౌతేలా ఆవేదన వ్యక్తం చేసింది.