టాలీవుడ్(Tollywood) హీరో అల్లరి నరేష్(Allari Naresh) నటిస్తోన్న తాజా సినిమా ఉగ్రం (Ugram). గతంలో నాంది సినిమా(Naandi Movie) తీసిన డైరెక్టర్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) ఉగ్రం సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటి వరకూ ఉగ్రం సినిమా నుంచి టీజర్(Teaser), పాటలు విడుదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5వ తేదిన ఉగ్రం సినిమా(Ugram Movie)ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.
ఉగ్రం సినిమా చాప్టర్-1 నైట్ షూట్ మేకింగ్ వీడియో :
విడుదలకు సిద్ధమవుతున్న ఉగ్రం సినిమా (Ugram Movie) ప్రమోషన్ వర్స్క్ను మొదలెట్టేసింది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలను రిలీజ్ (Making Videos Release) చేసింది. చాప్టర్1 నౌట్ షూట్, చాప్టర్2 ఫైట్ సీన్ మేకింగ్ వీడియోలను ఉగ్రం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సినిమాకు హైలెట్గా నిలిచే పవర్ ఫుల్ సీన్స్ కు సంబంధించి మేకింగ్ వీడియోలు రిలీజ్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి.
ఉగ్రం సినిమా చాప్టర్ 2 ఫైట్ సీన్ మేకింగ్ వీడియో :
మేకింగ్ వీడియోలు (Making Videos) సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. రాత్రి టైంలో వచ్చే యాక్షన్ సీన్స్ (Action Scenes) కోసం అల్లరి నరేష్ (Allari Naresh) టీమ్ ఎంత కష్టపడ్డారో మేకింగ్ వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. ఉగ్రం సినిమా(Ugram Movie)లో మలయాళ బ్యూటీ మిర్నా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు టూమ్ వెంకట్, అబ్బూరి రవి కథ, మాటలు అందించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. మే 5వ తేదిన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.