ప్రభాస్ క్రేజ్.. డార్లింగ్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్‌ను ఊహించుకొని గాల్లో తేలుతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన జస్ట్ లుక్స్‌కే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మసి పూసుకోని మైనింగ్ ఏరియాలో ప్రభాస్ చేసే యుద్ధాన్ని చూసేందుకు వెయ్యి కళ్లతో చూస్తున్నారు. ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇదే. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామినే. త్వరలోనే సీక్వెల్ పై క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. షూటింగ్ కంప్లీట్ అయిపోగానే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ కానున్నాడు ప్రశాంత్ నీల్. అలాగే సలార్ బిజినెస్ డీల్ కూడా క్లోజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే సలార్ మూవీకి ఓవర్సీస్లో భారీ డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని ఓవర్సీస్ బిజినెస్ సలార్‌కు జరిగినట్టు సమాచారం. ఇక ఓటిటి డీల్స్ అయితే సలార్ క్రేజ్ ఏంటో నిరూపిస్తున్నాయి. ఈ సినిమా కోసం రెండు బడా ఓటిటి సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోందట. ఎంతైనా సరే.. భారీగా చెల్లించేందుకు సై అంటున్నాయట. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ కోసం 200 కోట్ల ఆఫర్‌ని మేకర్స్ ముందు పెట్టాయట అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాల ఓటిటి రైట్స్‌ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో సలార్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ గట్టిగా ట్రై చేస్తోందట. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ కంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన కేవలం ఓటిటి ద్వారానే సలార్ మేకర్స్ లాభాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను దాదాపుగా 250 కోట్లతో నిర్మిస్తోంది హోంబలే ఫిల్మ్స్. అందుకే ఓటిటి రూపంలోనే అసలు వచ్చేస్తే.. ఇక శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ అంతా లాభమేనని అంటున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.