Tillu Square: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు, చిత్రానికి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో రూట్ మార్చిన సిద్ధుకు.. డీజే టిల్లు మూవీతో బ్రేక్ లభించింది. దీంతో యూత్‌లో ఊహించని క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’పేరుతో (Tillu Square) సీక్వెల్ చేస్తూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కూడా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు.
ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రానుంది. వాయిదా పడుతూ వచ్చింది. ఒకసారి చిరుతో పోటీ ఎందుకులే అని భోళా శంకర్‌తోపాటు వాయిదా వేశారు. ఈసారి సెప్టెంబర్ 15వ తేదీన కన్ఫామ్ చేశారు. ఇప్పుడు ఈ తేదీ కూడా వాయిదా వేయడం గమనార్హం. తాజాగా కొత్త డేట్ ని ప్రకటించారు. అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (anupama parameshwaran) నటిస్తోంది. మొదటి పార్ట్ లో నేహా శెట్టి నటించింది. ఆమెది అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. మరి అనుపమ (anupama) పాత్రను ఎలా డిజైన్ చేశారో చూడాలి. ఇక అనుపమ, ఈ మూవీలో చాలా బోల్డ్ సీన్స్ కూడా నటించినట్లు సమాచారం.