Tiger 3: ఫ్లాప్ దిశగా సల్మాన్ మూవీ.. ‘వార్2’ పరిస్థితేంటి!?
బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలింస్.. స్పై యూనివర్స్ సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాయి. ఇప్పటికే వచ్చిన వార్, పఠాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. టైగర్ 3 మాత్రం ఫ్లాప్ దిశగా దూసుకెళ్తోంది. మరి వార్2 పరిస్థితేంటి?
Tiger 3: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ 3 సినిమా, దీపావళి కానుకగా నవంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. ఆదిత్య చోప్రా నిర్మాతగా, మనీశ్ శర్మ దర్శకత్వంలో.. పఠాన్ తర్వాత యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన సినిమా కావడంతో.. డే వన్ భారీ ఓపెనింగ్స్ అందుకుంది టైగర్ 3. కానీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా ఆ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ వరకు కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఎనిమిది రోజుల్లో ఇండియాలో దాదాపు 230 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 376 కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.
ప్రపంచ కప్ క్రికెట్ పైనల్ జరిగిన రోజు వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. అప్పటి నుంచి టైగర్ 3 కోలుకునే పరిస్థితి లేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. వార్, పఠాన్ రేంజ్లో టైగర్ 3 బిగ్గెస్ట్ హిట్ లిస్ట్‌లో చేరడం కష్టం అంటున్నారు. వీకెండ్ వరకు ఇలాగే ఉంటే.. టైగర్ 3 ప్లాప్‌గా మిగిలిపోతుందనే టాక్ నడుస్తోంది. మరీ వార్2 పరిస్థితేంటి? అని, యంగ్ టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోలు లేకుండా షూటింగ్ చేస్తున్నారు. త్వరలో హృతిక్, తారక్ షూటింగ్లో జాయిన్ అవనున్నారు. టైగర్ 3 రిజల్ట్ చూసిన తర్వాత.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రిస్క్ చేస్తున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వార్2 ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతోంది. కాకపోతే.. టైగర్ 3లా కాకుండా.. వార్ 2 రిలీజ్‌ను కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వార్2 ఎలా ఉంటుందో చూడాలి.