Mansoor Ali Khan: I won’t apologize to Trisha: I didn’t say anything wrong
Trisha: త్రిషపై (Trisha) వివాదాస్పద నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ కామెంట్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినీ తారలు, అభిమానుల నుంచి మన్సూర్ అలీ ఖాన్ ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తప్పు తెలుసుకొని క్షమాపణలు చెబుతారని అంతా ఆశించారు. ఆయన మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని పేర్కొన్నాడు.
సినిమాల్లో రేప్ సన్నివేశాలు సహజమే అనే అంశాన్ని లేవనెత్తాడు. చాలా కామెడీగా అన్న విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదని, చిన్న విషయాన్నిపెద్ద సమస్యగా మార్చారని ఆరోపించారు. ఆ మాటలకు తనపై నింద వేసిన కొందరు తారలపై విరుచుకుపడ్డాడు.నడిగర్ సంఘం (సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తన వివరణను వినలేదని, నటుడికి వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేసిందని మన్సూర్ అలీ ఖాన్ విమర్శించారు. సంఘం హెచ్చరికను 4 గంటల్లో విత్ డ్రా డిమాండ్ చేశారు. త్రిష (Trisha) గురించి తాను చేసిన ప్రకటనకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించాడు.
లియో చిత్రంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆంటోని దాస్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా.. లియోకి అనుచరుడిగా మన్సూర్ నటించారు. లియో మూవీలో త్రిషని రేప్ చేసే అవకాశం రాలేదని కామెంట్ చేశాడు. త్రిష నటిస్తుందని చెప్పినప్పుడు బెడ్ రూమ్‌లో రేప్ సీన్ ఉంటుందని భావించానని.. చాలా చిత్రాల్లో రేప్ సన్నివేశాల్లో నటించానని చెప్పారు. తనకేమి రేప్ సీన్స్ చేయడం కొత్త కాదు.. త్రిషని తన చేతులతో బెడ్ రూమ్‌లోకి ఎత్తుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నానని అన్నారు.
ఆ చిత్రంలో త్రిషతో అసలు సన్నివేశాలే లేవు వెకిలిగా నవ్వుతూ కామెంట్స్ చేశాడు. ఇవి తీవ్ర దుమారం రేపాయి. త్రిష కూడా ఆ మాటలతో బాధపడింది. కోలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు కూడా స్పందించారు.