Bobby Singh: స్నేహితులే విలన్.. ‘వాల్తేరు వీరయ్య’ విలన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు!
రీసెంట్గా బాబీ సింహా పై కేసు నమోదైనట్టు వార్తలొచ్చాయి. ఓ ఇంజినీర్‌ను బెదిరించిన నటుడు బాబీ సింహా సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేశాడు బాబీ సింహా.
తెలుగు నటుడే కానీ.. తమిళ్ సినిమాల్లో సెటిల్ అయ్యాడు బాబీ సింహా. రవితేజ నటించిన ‘డిస్కో రాజా’తో పాటు ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్యలో విలన్‌గా నటించాడు. కాకపోతే ఇంటర్వెల్లోనే బాబీ సింహా క్యారెక్టర్ చనిపోతుంది. దీంతో పాటు ఇంకా చాలా సినిమాల్లో నటించాడు బాబీ. అయితే తాజాగా ఓ వివాదంలో ఇరుకున్నాడు బాబీసింహా. కొడైకెనాల్ విల్పట్టి పంచాయతీలోని పేత్తుపారైలో బాబీ సింహా కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నాడు. అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ స్థలంలో నిర్మిస్తున్నారని ఆయనపై, అదే ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్న ప్రకాశ్ రాజ్‌పై స్థానికులు ఫిర్యాదు చేశారు.
మరోవైపు బాబీ సింహాకు, కాంట్రాక్టర్ జమీర్‌కు గొడవలు జరగడంతో పనులు మధ్యలో ఆగిపోయాయి. దాంతో తనకు హత్య బెదిరింపులు వస్తున్నట్టు వెల్లడించాడు బాబీ సింహా. ఆయన మాట్లాడుతూ.. కొడైకెనాల్ లో ఇల్లు నిర్మించాలని అనుకుని, తమిళనాడులో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఉసేన్, అతని స్నేహితుడైన బిల్డింగ్ కాంట్రాక్టర్ జమీర్‌తో ఇంటి నిర్మాణ పనులకు ఒప్పందం కుదుర్చుకున్నాం. కోటీ 30 లక్షలతో నిర్మాణం కోసం అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఉసేన్, జమీర్ 40 లక్షల వరకు అదనంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.
వాళ్లపై కొడైకెనాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని, కానీ రాజకీయ నేపథ్యం ఉండటంతో పోలీసులూ చర్యలు తీసుకోలేదు. అందుకే కోర్టుకు వెళ్లామని అన్నాడు. దాంతో వారు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారను ఆరోపించారు. ‘సినిమాలో నువ్వు విలన్ కావొచ్చు.. కానీ మేం రియల్ విలన్స్’ అంటూ బెదిరిస్తున్నారని, ఓ ఎమ్మెల్యే అండతోనే ఇదంతగా జరుగుతుందని ఆరోపించారు. అన్నట్టు బెదిరిస్తున్న వారు బాబీ స్నేహితులే అని తెలుస్తోంది.