»This Is The Real Matter Mahesh Babu And Rajamouli Abroad Again
Mahesh Babu: ఇది అసలు మ్యాటర్.. మళ్లీ విదేశాలకు మహేష్ బాబు, రాజమౌళి?
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే.. విదేశాల నుంచి చర్చల మధ్యలోనే ఇండియాకి వచ్చేశారు మహేష్, జక్కన్న మరియు నిర్మాత. ఇప్పుడు మళ్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారట.
This is the real matter.. Mahesh Babu and Rajamouli abroad again?
Mahesh Babu: ఇటీవల సడెన్‌గా.. మహేష్ బాబు, రాజమౌళితో పాటు నిర్మాత కె ఎల్ నారాయణ కలిసి హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యారు. దీంతో మూవీ లవర్స్ అంతా సర్ప్రైజ్ అయ్యారు. ఇక ఎస్ఎస్ఎంబీ 29 పనులన్నీ దగ్గర పడ్డాయి.. అనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నారని అనుకున్నారు. కానీ కట్ చేస్తే అసలు మ్యాటర్ ఇదేనని తెలిసింది. రీసెంట్గా దుబాయ్‌ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మహేష్, రాజమౌళి అక్కడే ఉన్నారు. ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్ట్ వర్క్‌కి సంబంధించిన సిట్టింగ్స్ కోసం మహేష్, రాజమౌళి, నిర్మాత నారాయణ దుబాయ్ వెళ్లారు. కానీ అనుకోకుండా అక్కడ వరదలు రావడంతో వెంటనే ముగ్గురు హైదరాబాద్ వచ్చేశారని అంటున్నారు.
అంతే తప్పా.. ఇంకా స్కిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు సంబంధించిన చర్చలు కంప్లీట్ కాలేదని సమాచారం. దీంతో.. త్వరలోనే మళ్ళీ స్క్రిప్ట్ చర్చల కోసం విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారట. విదేశాల్లో అన్ని చర్చలు పూర్తి చేసుకొని.. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత ఎస్ఎస్ఎంబీ 29 అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. మే 31న ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన బయటికి రానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు స్క్రిప్ట్ చర్చలతో పాటు.. పూర్తిగా తన మేకోవర్ని మార్చే పనిలో ఉన్నాడు. వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ మహేష్ లుక్ ఫైనల్ అయ్యాక.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను రాజమౌళి పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు వెయ్యి కోట్లతో ఈ సినిమా రూపొందనుందని టాక్. మరి ఈసారి జక్కన్న ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.