»These Are The Movies That Will Be Released In Theaters And Otts This Week
Movies : ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలివే
వేసవి(Summer)లో మిమ్మల్ని అలరించడానికి కొత్త సినిమాలు(New Movies) రెడీ అయ్యాయి. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ(OTT)ల్లోనూ సినీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. వినోదాన్ని పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి(Summer)లో మిమ్మల్ని అలరించడానికి కొత్త సినిమాలు(New Movies) రెడీ అయ్యాయి. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ(OTT)ల్లోనూ సినీ ప్రేక్షకులకు వినోదం అందించడానికి సరికొత్త సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగులో వరుస సినిమాలు విడుదల కానున్నాయి. గత వారం రావణాసుర(Ravanasura), మీటర్(Meter) వంటి సినిమాలు విడుదలై సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. మరిప్పుడు వినోదాన్ని పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకుడు గుణశేఖర్ తీస్తున్న హిస్టారికల్ మూవీ శాకుంతలం(Shaakuntalam). ఈ సినిమాలో సమంత(samantha), దేవ్ మోహన్ జంటగా కనిపిస్తున్నారు. కాళిదాసు రచించిన అద్భుత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఏప్రిల్ 14వ తేదిన ఈ సినిమా రిలీజ్ కానుంది.
లాఘవ లారెన్స్(Raghava lawrence) నటించిన రుద్రుడు(Rudrudu) సినిమా కూడా ఏప్రిల్ 14వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో లారెన్స్ కు జోడీగా ప్రియా భవాణీ శంకర్ కనిపించనుంది. కతిరేశన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ వంటివారు నటించారు.
తమిళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సినిమా విడుదల(Vidudala). ఈ మూవీ ఇప్పటికే పలు భాషల్లో రిలీజ్ అయ్యి విజయం సొంతం చేసుకుంది. తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. ఏప్రిల్ 15వ తేదిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో సూరి, విజయ్ సేతుపతి(Vijay sethupathi) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వెట్రిమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
థియేటర్లతో పాటు ఓటీటీ(OTT)ల్లోనూ పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ మూవీ ఆహా(AHA)లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే ‘అసలు’ అనే చిత్రం ఈటీవీ విన్ లో ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ది మార్వెలస్ మిస్సెస్’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్(AMAZON prime)లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
‘ఓ కల’ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney hot star)లో ఏప్రిల్ 13వ తేది నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఫ్లోరియా మాన్’ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్(Netflix)లో ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు ‘క్వీన్ మేకర్’ అనే కొరియన్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 14న ‘ది లాస్ట్ కింగ్ డమ్’ అనే హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే ‘మిస్సెస్ అండర్ కవర్’ అనే హిందీ మూవీ జీ5(ZEE5)లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.