ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 28, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్ ప్రాజెక్ట్ ఓ చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. ఎన్టీఆర్ 30 మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. సంక్రాంతి తర్వాత ఈ సినిమాలు షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి. ఎన్టీఆర్ 30ని సంక్రాంతి కానుకగా ముహూర్త కార్యక్రమాలు చేసి.. ఫిబ్రవరిలో రెగ్యూలర్ షూట్ మొదలు పెట్టబోతున్నారు. ఎస్ఎస్ఎంబీ 28ని సంక్రాంతి తర్వాత తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. దాంతో ప్రస్తుతం మహేష్, ఎన్టీఆర్ ఫారిన్ వెకేషన్లో ఉన్నారు. అందుకే.. ఇప్పట్లో వీళ్ల నుంచి కొత్త అప్డేట్స్ రావడం కష్టం. ఏదో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెకేషన్ ఫోటోలు మాత్రమే షేర్ చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఈ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ 30 మూవీకి అనిరుధ్ మ్యూజిక్ ఇస్తుండగా.. మహేష్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే సంక్రాంతికి తమన్ మ్యూజిక్ ఇచ్చిన వారసుడు, వీరసింహారెడ్డి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. దాంతో ఈ నెల 24న గ్రాండ్‌గా వారసుడు ఆడియో ఫంక్షన్ జరుపుతున్నారు. అందుకోసం సన్నద్దమవుతున్నాడు తమన్. ఈ క్రమంలో తమన్, అనిరుధ్ కలిసి షికారు చేస్తున్నారు. తాజాగా కార్లో రైడ్ చేస్తూ అనిరుధ్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేశాడు థమన్. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 28, ఎన్టీఆర్ 30.. A drive Finally అని రాసుకొచ్చాడు తమన్. అయితే ఈ ఇద్దరు వేర్వేరు సినిమాలకు పని చేస్తున్నా.. ప్రస్తుతం కలిసింది మాత్రం వారసుడు సినిమా కోసమేనని అంటున్నారు. వారిసు ఆడియో లాంచ్ వేదిక పై ఇద్దరూ కలిసి ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. ప్రస్తుతం అనిరుధ్, తమన్ హవా నడుస్తోంది.