సుస్మితా సేన్ (Sushmita Sen) మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే మహిళ. అయితే ఈ మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. ‘గోల్డ్ డిగ్గర్(Gold Digger)’ అంటూ ఆమెను విమర్శిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సుస్మితా సేన్ కాస్త ఘాటుగానే స్పందించింది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ తనను విమర్శిస్తున్నారని.. ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. అవమానాలను స్వీకరించడం అంటే అది అవమానమేనని, అందుకే తాను స్వీకరించనని తెలిపారు. ఇతరుల వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అన్న ఆమె.. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని స్పష్టం చేశారు. తనపై వచ్చే కామెంట్లపై స్పందించవద్దని ఇండస్ట్రీ(Industry)లోని ఎంతో మంది తనకు చెప్పారని అన్నారు. తనకు సంబంధించిన వ్యవహారాలపై తనకు ఇష్టం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు.
తనకు గోల్డ్ కంటే డైమండ్స్ అంటే ఇష్టమని.. తన కోసమే వాటిని కొంటుంటానని తెలిపారు. బాలీవుడ్ (Bollywood) నటి సుస్మితా సేన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు. తన కొత్త ప్రాజెక్ట్ తాళి ప్రమోషన్స్(Thali Promotions)లో భాగంగా ఓ ఇంటర్వ్యూలోపాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు పర్సనల్ విషయాలపై స్పందించారు. లలిత్ మోదీతో తాను రిలేషన్లో ఉన్నట్లు గతంలో వచ్చిన వార్తలపై మాట్లాడుతూ.. ఆ సమయంలో పలువురు నెటిజన్లు తనను గోల్డ్ డిగ్గర్ అని విమర్శించారని చెప్పారు. కానీ ఇది తన జీవితమని, బయటి వ్యక్తులకు అనవసరమన్నారు. తాళి ఫస్ట్ లుక్‌పై విమర్శలు రావడంపై స్పందిస్తూ.. సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్ శ్రీగౌరి సావంత్ జీవితం (Life of Srigauri Sawant) ఆధారంగా ఈ సినిమా తీసినట్లు చెప్పారు.ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా కొంతమంది నెటిజన్లు అసభ్యంగా కామెంట్ చేశారని, వాటిని చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తున్నారనిపించిందని అన్నారు.