సెన్సేషనల్ మూవీ సింగం సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 2010లో హరి దర్శకత్వంలో.. సూర్య హీరోగా రూపొందిన ‘సింగం’ సినిమా.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో సింగం సీక్వెల్‌గా 2013లో ‘సింగం 2’ తెరకెక్కించారు. ఈ మూవీ అంతకు మించి అనేలా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో మరోసారి 2017లో ‘సింగం 3’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇక ఈ మూడు సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దుమ్ముదులిపాడు సూర్య. ఈ సిరీస్ సూర్యని మాస్ ఆడియన్స్‌కి బాగా దగ్గర చేసింది.
అందుకే మరోసారి సింగం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ హరి ‘సింగం 4’ కోసం పవర్ ఫుల్ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సూర్య పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. విభిన్న దర్శకుడు బాల.. మాస్ డైరెక్టర్ సిరుతై శివతో భారీ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. అలాగే వెట్రిమారన్, జై భీమ్ దర్శకుడితో కూడా సినిమాలు చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సింగం 4 లైన్లోకి రావడంతో.. ముందు దీన్నే పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ లోపు హరి కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ అవనున్నాయట. ఆ తర్వాత సింగం బరిలోకి దిగడం ఖాయమంటున్నారు. దీంతో సింగం 4 అప్టేట్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి ఈ సారి సింగం ఎలా సందడి చేస్తాడో చూడాలి.