War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి 'వార్ 2'లో నటించబోతున్నారని తెలిసినప్పటి నుంచి.. ఈ ప్రాజెక్ట్ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హృతిక్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అది కూడా హీరో-విలన్‌గా అంటే మామూలు విషయం కాదు.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ‘వార్ 2’లో నటించబోతున్నారని తెలిసినప్పటి నుంచి.. ఈ ప్రాజెక్ట్ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హృతిక్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అది కూడా హీరో-విలన్‌గా అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. స్పై యూనివర్స్‌లో భాగంగా వార్ 2 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ పై అఫీషయల్ అనౌన్స్మెంట్ మాత్రవ రాలేదు. కానీ మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్లు కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో హృతిక్ రోషన్ సరసన హీరోయిన్గా దీపిక పదుకొనే ఫిక్స్ అయినట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారు? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లు పరిశీలనలో ఉన్నా.. ఆలియాభట్ దాదాపుగా ఫైనల్ అయిందనే టాక్ నడుస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్‌తో కలిసి కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకుంది అలియా భట్. కానీ వార్2లో ఫుల్ లెంగ్త్‌లో రొమాన్స్ చేయనుందని అంటున్నారు. అలాగే ఇప్పటివరకూ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ ప్లే చెయ్యలేదు ఆలియా. కాబట్టి వార్2లో ఆలియా ఫైనల్ అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.