బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు. బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల దర్శకుడిగా బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్ స్థాయిలో అట్రాక్ట్ చేశాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు టాలీవుడ్ సినిమాల వైపు చూస్తుందంటే దానికి కారణం జక్కన్న. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం రాజమౌళి రేంజ్ నెక్ట్స్ లెవల్. అలాంటి రాజమౌళిలో ఎలాంటి మార్పు లేదు కదా.. ఇంకా తాను నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నానని అనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు రాజమౌళి సినిమాలకు.. తన బిహేవియర్‌కు సంబంధమే ఉండదు. రాజమౌళి అంటేనే సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్. దర్శకుడిగా ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటాడనే విషయం.. ఇప్పుడు మరోసారి రుజువైంది.
రీసెంట్గా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరయ్యాడు రాజమౌళి. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’కు హాలీవుడ్ నుంచి ఇంత గొప్ప ఆదరణ లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ఇక తన కథలు దేశం దాటి వెళ్తాయని ఎప్పుడూ అనుకోలేదట. కానీ బాహుబలికి జపాన్‌లో వచ్చిన ఆదరణ చూసిన తర్వాతే నమ్మకం కలిగిందన్నారు. ఆర్ఆర్ఆర్ గురించి గొప్పగా మాట్లాడటం చూసి, ఇవన్నీ నా గురించి, నా సినిమాల గురించేనా.. అని అనిపించిందన్నారు. అయితే హాలీవుడ్ ఆడియెన్స్‌కు తన సినిమాలు నచ్చుతున్నాయి కదా అని.. తన ఆలోచన ధోరణి మార్చుకోనని.. కథను చెప్పే విధానంలో తనకో స్టైల్ ఉందని.. ఎన్ని సినిమాలు చేసినా.. ఇది రాజమౌళి స్టోరీ కాదే అనిపించకూడదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తను నేర్చుకోవాల్సింది చాలా వుందని.. ఇప్పుడిప్పుడే అడుగులు వేయటం మొదలు పెట్టానని చెప్పడం విశేషం. దీంతో రాజమౌళినే ఇలా అంటే.. మిగతా దర్శకుల పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది.