దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.